దేశంలో టెక్నాలజీ తెచ్చిందే రాజీవ్ గాంధీ : జగ్గారెడ్డి

దేశంలో టెక్నాలజీ తెచ్చిందే రాజీవ్ గాంధీ : జగ్గారెడ్డి
  •      హైటెక్ సిటీ కూడా ఆయన ఆలోచనే 

హైదరాబాద్, వెలుగు : టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్​ను దేశానికి పరిచయం చేసిందే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మోదీ, కేసీఆర్ వాడుతున్న టెక్నాలజీ అంతా రాజీవ్ గాంధీ తీసుకొచ్చిందే అని చెప్పారు. బుధవారం గాంధీభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జైల్లో ఉన్న బిడ్డతో కేసీఆర్ మాట్లాడుతున్నడు. దానికి టెక్నాలజీ అవసరం.. అది తీసుకొచ్చింది రాజీవ్ గాంధీనే.. హైటెక్ సిటీకి పునాది ఆయన ఆలోచనే. 

70 ఏండ్లలో ఏం చేశారని కేటీఆర్, హరీశ్, బీజేపీ నేతలు మమ్మల్ని అడుగుతున్నరు. మేము ఏం చేశామో వారందరూ తెలుసుకోవాలి. రాజీవ్​గాంధీ ఎప్పుడూ ప్రధానిలా కాకుండా.. ఎంప్లాయ్ మాదిరి పనిచేశారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి’’అని అన్నారు. తండ్రి ఆశయాల కోసం రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టారని, దేశ ప్రజలందరినీ తన కుటుంబ సభ్యులుగా భావిస్తారని తెలిపారు.