అదృష్టం వరించినా.. ఇబ్బందులు తప్పుతలేవు

అదృష్టం వరించినా.. ఇబ్బందులు తప్పుతలేవు
  • కన్ఫర్మేషన్ ఆర్డర్​లో టవర్ నంబర్ వేయని అధికారులు
  • నంబర్ లేకుంటే లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వలేమంటున్న  బ్యాంకులు    
  • దిక్కుతోచని స్థితిలో టోకెన్​ అమౌంట్ చెల్లించిన లబ్ధిదారులు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లోని బండ్లగూడ, పోచారంలో రాజీవ్ గృహ కల్ప ఫ్లాట్ల లాటరీలో  అదృష్టం వరించినా.. లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేవు. 10 శాతం టోకెన్​ అమౌంట్ కట్టిన లబ్ధిదారులకు హెచ్​ఎండీఏ అధికారులు జారీ చేసిన ఫ్లాట్ కన్ఫర్మేషన్​ ఆర్డర్​లో టవర్ నంబర్ లేకపోవడంతో లోన్ ఇచ్చేందుకు బ్యాంకు ఆఫీసర్లు ముందుకు రావడం లేదు. అలాగే మరికొందరికి ఐటీ రిటర్న్​ చెల్లించినట్లు సర్టిఫికెట్లు లేకపోవడంతో లోన్​ ఇవ్వడం కుదరదని బ్యాంకర్లు  తెగేసి చెప్తున్నారు. దీంతో ఒకేసారి ఇంత మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోన్​ ఇస్తే నెలనెలా ఏదో ఒక పని చేసుకుని కిస్తీలు కట్టేవాళ్లమని, కానీ లోన్​ రాకపోతే ఎలా చెల్లించాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కట్టిన పైసలు వచ్చేనా..? 

హైదరాబాద్​లో 12 ఏండ్ల కింద నిర్మించిన బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ గృహకల్ప అపార్ట్​మెంట్లలో ఫ్లాట్లను అమ్మకాని పెట్టగా 39వేల అప్లికేషన్లు వచ్చాయి. 3 రోజుల పాటు ఓపెన్ లాటరీ తీసి ఫ్లాట్లకు లబ్ధిదారులను సెలక్ట్ చేశారు. వీరి లిస్టును హెచ్​ఎండీఏ వెబ్ సైట్ లోనూ పెట్టారు. వారు దక్కించుకున్న ఫ్లాట్ నంబర్, టవర్ నంబర్​ వివరాలను ఇంటిమేషన్ లెటర్​లో పేర్కొన్నారు. ఆ తర్వాత ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొత్తం వ్యాల్యూలో 10శాతం డబ్బును టోకెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్వాన్స్​‍గా చెల్లించినవాళ్లకు  కన్ఫర్మేషన్ లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఇచ్చారు. ఇక్కడే రాజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వగృహ అధికారులు చేసిన  నిర్లక్ష్యం లబ్ధిదారులకు శాపంగా మారింది. ఆ లెటర్​లో ఫ్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే ఉండడం,  టవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్​ లేకపోవడంతో అందులో వివరాలు సరిగా లేవని, వాటితో లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం కుదరదని బ్యాంక్ ఆఫీసర్లు చెప్తున్నారు. 

ఆందోళనలో లబ్ధిదారులు

ఈ విషయమై రాజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వగృహ అధికారులను వివరణ కోరగా మొదట ఇచ్చిన ఇంటిమేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫ్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండూ ఉన్నాయని,  ఆ లెటర్​ లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సరిపోతుందని దాటవేస్తున్నారు. ఇదే విషయాన్ని లబ్ధిదారులు వెళ్లి బ్యాంకు ఆఫీసర్లకు చెప్తే.. 10 శాతం టోకెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్వాన్స్​‍ కట్టనివారి దగ్గర కూడా ఇంటిమేషన్​ లెటర్లు ఉన్నాయని, వాటి ఆధారంగా లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వలేమంటున్నారు. దీంతో టోకెన్​ అమౌంట్ చెల్లించిన లబ్ధిదారుల్లో గందరగోళం నెలకొంది. తాము అనవసరంగా టోకెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్వాన్స్​‍ కట్టామేమోనని, ఒకవేళ 80 రోజుల్లోపు లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాకపోతే రూ.3లక్షల నుంచి 
రూ.1లక్ష వరకు కట్టిన టోకెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్వాన్స్​‍ రాకుండా పోతుందేమోనని ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయం తెలియడంతోనే చాలా మంది లబ్ధిదారులు టోకెన్​ అమౌంట్ చెల్లించేందుకు ముందుకు రావడం లేదని తెలిసింది. 

అధికారులు పట్టించుకోవట్లే..!

రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు లాటరీ తీసి లబ్ధిదారులను సెలక్ట్ చేసిన అధికారులు.. ఆ తర్వాత వారికి సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టోకెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్వాన్స్​‍ చెల్లించేందుకు జులై12ను గడువుగా విధించిన అధికారులు.. ఎంపికైన వారికి  ఇంటిమేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెటర్లను మాత్రం 12వ తేదీ తర్వాతే పంపడం విమర్శలకు తావిస్తోంది. వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకుంటే తప్పా తమకు ఫ్లాట్లు అలాట్​ అయిన విషయం తమకు తెలియలేదని, తమ సెల్ ఫోన్లకు కనీసం  మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఫోన్లు కూడా రాలేవని, అందుకే చాలా మంది ఇప్పటి వరకు టోకెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్వాన్స్​‍ కూడా కట్టలేదని బోడుప్పల్ చెందిన ఓ లబ్ధిదారుడు మండిపడ్డారు. అలాగే బ్యాంకు లోన్లు, అపార్ట్​మెంట్స్​ లో వసతులు, ఆ ఫ్లాట్లపై గతంలో ఉన్న నల్లాబిల్లుల విషయంలో అధికారులు క్లారిటీ ఇవ్వకపోవడంతోనే టోకెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్వాన్స్​‍ చెల్లించేందుకు గడువులోగా సగం మంది కూడా రాలేదని తెలుస్తోంది. అందుకే గడువును 30వ తేదీ వరకు పెంచినట్లు సమాచారం. రాజీవ్ గృహకల్ప ఆఫీసర్లు జోక్యం చేసుకొని ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.