సింగరేణి అండర్​గ్రౌండ్ బొగ్గు గనుల్లో భద్రతా ప్రమాణాల పాటించాలి : డిప్యూటీ డైరెక్టర్ మైన్స్​ సేఫ్టీ రాజీవ్​ ఓంప్రకాశ్​ వర్మ

సింగరేణి అండర్​గ్రౌండ్ బొగ్గు గనుల్లో భద్రతా ప్రమాణాల పాటించాలి : డిప్యూటీ డైరెక్టర్ మైన్స్​ సేఫ్టీ రాజీవ్​ ఓంప్రకాశ్​ వర్మ

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి అండర్​గ్రౌండ్ బొగ్గు గనులు, ఓపెన్​కాస్ట్​ మైన్లలో విద్యుత్​ ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలు పాటించాలని డిప్యూటీ డైరెక్టర్ ​మైన్స్​సేఫ్టీ(ఎలక్ట్రికల్) రాజీవ్​ఓంప్రకాశ్​వర్మ సూచించారు. శనివారం సాయంత్రం మందమర్రిలోని స్కిల్​డెవలప్​మెంట్​కాన్ఫరెన్స్​హాల్​లో ఎలక్ట్రికల్​సేఫ్టీ, టెక్నాలజీ ఇంటరాక్టివ్​సెషన్​నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. అధికారులు, ఉద్యోగులకు విద్యుత్​ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలని సూచించారు.

కేకే ఓసీపీ, కేకే–5 గనుల్లో ఎలక్ట్రికల్​సేఫ్టీపై తనిఖీలు చేశారు. అనంతరం మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్​, ఆఫీసర్లు ఆయనను సన్మానించారు. బెల్లంపల్లి రీజియన్​సేఫ్టీ జీఎం కె.రఘుకుమార్, ఎస్​వోటూ జీఎం విజయప్రసాద్, ఏరియా ఇంజినీర్​ వెంకటరమణ, సేఫ్టీ ఆఫీసర్ ఎం.రవీందర్, కేకే గ్రూప్​ ఏజెంట్​రాంబాబు, కేకే ఓసీపీ పీవో ఎం.మల్లయ్య, ఎంవీటీసీ మేనేజర్​శంకర్, ఇంజినీర్లు, ఎలక్ర్టికల్​సూపర్​వైజర్లు పాల్గొన్నారు.