
- గజం 46వేలకు కొన్న బిడ్డర్లు
హైదరాబాద్, వెలుగు: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ బహిరంగ వేలం ద్వారా చేపట్టిన ఓపెన్ ప్లాట్ల విక్రయాలకు భారీ స్పందన వస్తోంది. గత రెండు రోజులుగా సిటీ పరిసరాల్లోని పలు ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మేడ్చల్–-మల్కాజ్గిరి జిల్లాలోని బహదూర్ పల్లి ప్రాంతంలో 68 ప్లాట్లకు సంబంధించిన బహిరంగ వేలం ప్రక్రియను మంగళవారం చేపట్టారు. ప్లాట్ల అమ్మకంతో కార్పొరేషన్ కు రూ.100 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఎండీ వీపీ. గౌతమ్ పత్రిక ప్రకటనలో వెల్లడించారు.
ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో నిర్వహించిన కొనుగోలు వేలంలో119 మంది పాల్గొన్నారని, 200- నుంచి1000 చదరపు గజాల విస్తీర్ణంలోఉన్న ప్లాట్లలో, కార్నర్ ప్లాట్ కు గజం రూ.30 వేలు, ఇతర ప్లాట్లకు గజం రూ.27 వేలు ఆఫ్ సెట్ ధరగా నిర్ణయించామన్నారు. వేలంలో ఒక్కో ప్లాట్ కోసం దాదాపు 30 మంది వరకు కూడా పోటీ పడ్డారని ఎండీ పేర్కొన్నారు. అత్యధికంగా గజం రూ. 46,500 పలికిందని ఎండీ గౌతమ్ తెలిపారు.