
హైదరాబాద్, వెలుగు: పోచారంలోని రాజీవ్ స్వగృహ అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి శుక్రవారం (ఆగస్టు 01) లాటరీ ద్వారా ఫ్లాట్లు కేటాయించారు. రెండ్రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రక్రియలో తొలి రోజు డబుల్ బెడ్ రూం ఫ్లాట్లకు సంబంధించిన లాటరీ నిర్వహించగా, శనివారం సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ల లాటరీ తీయనున్నట్లు కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం తెలిపారు.
లాటరీ కార్యక్రమంలో రాజీవ్ స్వగృహ చీఫ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి, జనరల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, ఘట్‌కేసర్ ఎమ్మార్వో రజని సమక్షంలో 190 మంది దరఖాస్తుదారులకు ఫ్లాట్లను కేటాయించారు. వీటి విక్రయాల రూ.36 కోట్ల ఆదాయం వచ్చిందని ఎండీ తెలిపారు.