తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా: కుమార్ పాటిల్

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా: కుమార్ పాటిల్

సిద్దిపేట రూరల్, వెలుగు: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని.. బీజేపీని గెలిపించడానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కర్ణాటక బీజేపీ నేత, జిల్లా ఎన్నికల ఇన్‌చార్జి రాజ్ కుమార్ పాటిల్ అన్నారు. ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మోకిడి నర్సింహారెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన  సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి  రావడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు.

అన్ని వర్గాల సంక్షేమం బీజేపీతోనే సాధ్యమన్నారు. ఈ సమావేశంలో విద్యాసాగర్, రాంచంద్రారెడ్డి, ఉపేందర్ రావు, మల్లేశం, నరేశ్​, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, నరసింహారెడ్డి, పరుశరాములు, కుమారస్వామి, రాజు, వేణుగోపాల్, శంకర్, వెంకటేశం, మార్కండేయులు పాల్గొన్నారు.