సముద్రపు లోతుల్లో మరో శక్తి: నేవీ అమ్మలపొదిలోకి ‘ఖండేరి’

సముద్రపు లోతుల్లో మరో శక్తి: నేవీ అమ్మలపొదిలోకి ‘ఖండేరి’
  • జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి రాజ్ నాథ్

భారత నేవీ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. జలాంతర్గామి INS ఖండేరిని జాతికి అంకితమిచ్చారు రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఖండేరి అన్న పేరును టూత్ ఫిష్ పేరు ప్రకారం పెట్టారు. అరేబియా సముద్రంలో ఉండే ఈ ఫిష్ సముద్రం అడుగు భాగం వరకు వెళ్లి వేటాడుతుంది. అందుకే ఆ పేరు పెట్టారు. పూర్తి దేశీయ టెక్నాలజీతో రూపొందించిన ఈ INS ఖండేరి.. చాలా రోజుల వరకు సముద్రంలోనే ఉండగలుగుతుంది. 36 మంది సిబ్బంది అవసరం. దేశ తీరప్రాంత రక్షణ కోసం వినియోగంలోకి తెస్తున్న సబ్ మెరైన్స్ ను అఖండ, అబేధ్య, అదృశ్య పేరుతో ప్రయోగిస్తున్నారు.

INS ఖండేరి జల ప్రవేశం కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చారు. భారత్ దగ్గరున్న అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో సత్తా చాటుతామని,ఈ విషయాన్ని పాకిస్తాన్ గ్రహించాలన్నారు. జమ్మూ కశ్మీర్ లో అభివృద్ధి బాటలు పరుస్తున్నామని, ఇందుకు అంతర్జాతీయ మద్దతు లభిస్తోందన్నారు. అయితే పాకిస్తాన్ మాత్రం తన బుద్ది మార్చుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు.