తేజస్ యుద్ధ విమానమెక్కిన తొలి రక్షణ మంత్రి

తేజస్ యుద్ధ విమానమెక్కిన తొలి రక్షణ మంత్రి

తేజస్ యుద్ధ విమానం ఎక్కి ఆకాశంలో వార్ ఫీల్ పొందిన తొలి రక్షణ మంత్రిగా రాజ్ నాథ్ సింగ్ రికార్డులకెక్కారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన లైట్  కంబాట్  ఎయిర్ క్రాఫ్ట్  తేజాస్  లో ఆయన ఈ ఉదయం ప్రయాణించారు. బెంగళూరులోని హాల్ ఎయిర్ పోర్టు నుంచి తేజస్ లో ఫ్లై అయిన రాజ్ నాథ్ సింగ్… 30 నిమిషాల పాటు అందులో ప్రయాణించారు. తిరిగొచ్చిన తర్వాత విజయసంకేతం చూపుతూ చాలా థ్రిల్ ఫీల్ అయ్యానన్నారు రాజ్ నాథ్ సింగ్. తేజస్ యుద్ధవిమానం అన్ని విధాలా అద్భుతంగా ఉందని చెప్పారు. సొంత పరిజ్ఞానంతోనే అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసుకున్నందుకు గర్వంగా ఉందన్నారు.  HAL, DRDO అధికారులను ఆయన అభినందించారు. అందరితో కలిసి గ్రూప్ ఫోటో దిగారు రక్షణశాఖ మంత్రి.

ఉమెన్స్ డే వేడుకల్లో సిందు ఫీట్

తేజస్ ను హిందుస్థాన్  ఏరోనాటిక్స్  లిమిటెడ్  ఉత్పత్తి చేసింది. గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోగల సామర్థ్యం దీని సొంతం. ఎలక్ట్రానిక్  యుద్ధ సూట్లు కూడా ఇందులో ఉంటాయి. అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తైన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో తేలికపాటి యుద్ధ విమానం వాయుసేనలో చేరింది. ఈ ఏడాది ఏరో ఇండియా ఉమెన్స్  డే వేడుకల్లో  భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తేజస్ లో ప్రయాణించారు.