రామరాజ్యం స్థాపిస్తం: రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్​

రామరాజ్యం స్థాపిస్తం: రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్​

చత్రా: అయోధ్య మందిరం ప్రారంభోత్సవంతో దేశంలో రామరాజ్య స్థాపనకు అడుగులు పడ్డాయని రక్షణ మంత్రి రాజ్ నాథ్  సింగ్ అన్నారు. 2027 లోపు ప్రపంచంలోనే టాప్ 3 ఆర్థిక వ్యవస్థలో భారత్ ఉంటుందన్నారు. జార్ఖండ్​లోని చత్రా జిల్లాలో శుక్రవారం జరిగిన ఓ ర్యాలీలో రాజ్ నాథ్  మాట్లాడారు. ఏ పరిస్థితుల్లో సీఏఏ అమలు చేస్తున్నామో ప్రతిపక్ష నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. ‘పాక్​ జనాభాలో ఒకప్పుడు 23% ఉన్న హిందువులు ప్రస్తుతం 3 శాతానికి పడిపోయిందన్నారు. 

బంగ్లాదేశ్, అఫ్గాన్  వంటి దేశాల్లో మైనారిటీలైన హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, పార్సీలు మతపరమైన వేధింపులకు గురవుతున్నారు. ఆ ఘోరాలు భరించలేక ఆశ్రయం కోరుతూ భారత్​కు వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. కానీ, ప్రతిపక్షాలు బీజేపీపై మతపరమైన ముద్ర వేశాయి” అని రాజ్ నాథ్  వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వంలో మన దేశం త్వరలోనే విశ్వగురు అవుతుంద ని ఆయన చెప్పారు. మూడోసారి మాత్రమే కాదు దేవుడి దయతో నాలుగోసారి కూడా మోదీనే ప్రధాని అవుతారన్నారు.