రాజు శ్రీవాత్సవ బ్రెయిన్ పని చేయడం లేదు

రాజు శ్రీవాత్సవ  బ్రెయిన్ పని చేయడం లేదు

ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాత్సవ ఆరోగ్యం అంతకంతకూ విషమిస్తోంది. ప్రస్తుతం ఎయిమ్స్ ఐసీయూలో ఉన్న ఆయనకు వెంటిలేటర్పైనే చికిత్సకు కొనసాగుతోందని డాక్టర్లు చెప్పారు. బ్లడ్ ప్రెషర్ హెచ్చుతగ్గులకు గురవుతున్నట్లు తెలుస్తోంది. గత 9 రోజులుగా శ్రీవాత్సవ అచేతన స్థితిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన త్వరగా కోలుకునేలా ప్రార్థనలుచేయాలంటూ రాజు సన్నిహితుడు సునీల్ పాల్ పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. 

ఆగస్టు 10న రాజు శ్రీవాత్సవ జిమ్లో వర్కౌట్ చేస్తుండగా హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో వెంటనే ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. అప్పటి నుంచి రాజు శ్రీవాత్సవకు వెంటిలేటర్ పైనే ట్రీట్ మెంట్ కొనసాగిస్తున్నారు. బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడైన రాజు శ్రీవాత్సవ... 2005 - 2017 మధ్య కాలంలో టీవీలో ప్రసారమైన కామెడీ టాలెంట్ ‘షో ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’ తో ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. దేశంలోని ఫేమస్ స్టాండ్ అప్ కమెడియన్లలో ఒకరిగా నిలిచారు. సెలబ్రెటీలను, రాజకీయ నాయకులను ఇమిటేట్ చేయడంలో రాజు దిట్ట. మైనే ప్యార్ కియా, బాజీగర్, బాంబే టు గోవా, ఆమ్దని అఠాణ్ని.. ఖర్చా రూపయ్యా తదితర చిత్రాల్లోనూ నటించారు. హిందీ బిగ్ బాస్ సీజన్ 3లోనూ పాల్గొన్నాడు.