అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని రావ్ జంటగా చైతు జొన్నలగడ్డ కీలకపాత్రలో సాయిలు కంపాటి తెరకెక్కించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈటీవీ విన్ ఒరిజినల్స్ సమర్పణలో రాహుల్ మోపిదేవితో కలిసి దర్శకుడు వేణు ఊడుగుల నిర్మిస్తున్నారు. నవంబర్ 21న థియేటర్లో ప్రేక్షకుల ముందుకొస్తోంది. బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు.
సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు మేకర్స్. ఈ క్రమంలో గురువారం (నవంబర్ 13న) ట్రైలర్ రిలీజ్ చేశారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల మధ్య ఓ గ్రామంలో ప్రేమతో కూడిన ఓ విషాదభరితమైన సంఘటన జరిగి అక్కడే సమాధి అయ్యింది. దాని బేస్ చేసుకుని సినిమా రూపొందించినట్లు తెలుస్తోంది.
అందుకు తగ్గట్టుగానే మనసును హత్తుకునే అంశాలతో, ప్రేక్షకులు ఎమోషనల్ ఫీల్ అయ్యేలా ట్రైలర్ సాగింది. తెలంగాణ నేటివిటీని, లవ్, ఫ్యామిలీ పెద్దపీట వేసిన ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేలా చేసింది. ‘రా, రస్టిక్, రియల్’అంటూ హీరో అడవి శేష్ ట్రైలర్ మీడియా ద్వారా షేర్ చేశారు.
Raw. Rustic. Real.
— Adivi Sesh (@AdiviSesh) November 13, 2025
The #RajuWedsRambai trailerhttps://t.co/nePTra3fAu pic.twitter.com/0plPGRi1mT
