ఉద్యోగ ఖాళీలను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలి : ఎంపీ ఆర్.కృష్ణయ్య

ఉద్యోగ ఖాళీలను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలి : ఎంపీ ఆర్.కృష్ణయ్య

బషీర్ బాగ్/ముషీరాబాద్, వెలుగు :  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డిని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య శుక్రవారం కలిశారు. గ్రూపు-1, 2, 3, 4లోని డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కోటాను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని కోరారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో చాలా ఖాళీలు ఉన్నాయని చెప్పారు. గడిచిన పదేండ్లలో ఎంతమంది రిటైర్​అయ్యారో లెక్కలు తీయాలన్నారు.

ఆయన వెంట బీసీ నాయకులు ఉన్నారు. అలాగే రాష్ట్రంలో అదనంగా 112 గురుకులాలను మంజూరు చేయాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం విద్యానగర్ బీసీ భవన్ లో ఆయన మాట్లాడారు. విద్యాశాఖకు మంత్రిని  కేటాయించాలని కోరారు.