రాష్ట్రంలో ఈడీ, ఐటీ దాడులు మంచి పరిణామం కాదు : వద్దిరాజు రవిచంద్ర

రాష్ట్రంలో ఈడీ, ఐటీ దాడులు మంచి పరిణామం కాదు : వద్దిరాజు రవిచంద్ర

రాష్ట్రంలో ఈడీ, ఐటీ దాడులు మంచి పరిణామం కాదని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. రాజకీయ కోణంలో దాడులు చేస్తున్నారని చెప్పారు. తాము 30 ఏళ్ల నుంచి బిజినెస్ చేస్తున్నామన్నారు. వ్యాపారస్తులు దొంగలు కాదన్న ఆయన..తాము ఎలాంటి దాడులు చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈడీ, ఐటీ దాడులపై పెట్టె దృష్టిని అభివృద్ధిపై పెట్టాలన్నారు. తమ బంధువుల ఇళ్ళల్లోనూ ఈడీ, ఐటీ సోదాలు జరుగుతున్నాయని తెలిపారు. 

తమ కుమారుడు నడుపుతున్న గాయత్రి గ్రానైట్ కంపెనీపై నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి వరకూ ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేశారని చెప్పారు. ఆఫీస్ ను సీజ్ చేసి, నోటీసులు కూడా జారీ చేశారని అన్నారు. తమ బావ కంపెనీలోనూ తనిఖీలు చేపట్టారని తెలిపారు. తాము ఎటువంటి మోసాలకు పాల్పడలేదని, వ్యాపారాలను నిబంధనల ప్రకారమే నిర్వహిస్తున్నామన్నారు. ఐటీ, ఈడీ అధికారుల విచారణకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు.