రాకేష్ మాస్టర్ చివరి కోరిక ఏంటో ముందే చెప్పాడు

రాకేష్ మాస్టర్ చివరి కోరిక ఏంటో ముందే చెప్పాడు

రాకేష్ మాస్టర్ మృతి టాలీవుడ్ ను కలచివేసింది. పలువురు ప్రముఖులు ఆయన మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే తన రాకేష్ మాస్టర్ చివరికోరిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   తాను చనిపోయిన తర్వాత ఎక్కడ సమాధి చేయాలనేది గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన మామ సమాధి పక్కన  ఓ వేప మొక్క పెంచుతున్నానని.. తాను చనిపోయిన తర్వాత  ఆ చెట్టు కిందే తనను సమాధి చేయండని రాకేష్ మాస్టర్ చెప్పిన ఇంటర్వ్యూ ఇపుడు వైరల్ అవుతోంది.

రాకేష్ మాస్టర్ దాదాపు 1500 సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు. టాలీవుడ్ టాప్ హీరోలు ప్రభాస్, మహేశ్ బాబు, రవితేజ వంటి స్టార్ హీరోలకు డ్యాన్స్ నేర్పించాడు. హీరో వేణు తనకు లైఫ్ ఇచ్చాడని రాకేష్ మాస్టర్ యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో చెప్పిన సంగతి తెలిసిందే..

రక్తవిరేచనాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  జూన్ 18న సాయంత్రం 5 గంటలకు రాకేష్ మాస్టర్   కన్నుమూసిన సంగతి తెలిసిందే..బోరబండలో ఆయన అంత్యక్రియలు  జరగనున్నాయి. రాకేష్ మాస్టర్ కళ్లను ఆయన కుటుంబ సభ్యులు దానం చేశారు.