సినీ ఇండస్ట్రీ నుంచి సోషల్ మీడియా స్టార్ గా రాకేష్ మాస్టర్

సినీ ఇండస్ట్రీ నుంచి సోషల్ మీడియా స్టార్ గా రాకేష్ మాస్టర్

రాకేష్ మాస్టర్ మృతి అందరిని షాక్ కు గురిచేసింది. సినిమాలో కొరియోగ్రాఫర్ కంటే ఆయన ఇంటర్వ్యూలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యారు. వివాదాస్పద కామెంట్లతో సోషల్ మీడియా స్టార్ గా ఎదిగారు. 

1500ల సిన్మాలకు కొరియోగ్రఫీ

దాదాపు 1500ల సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు  రాకేష్ మాస్టర్. ప్రభాస్,మహేశ్ బాబు, రవితేజ వంటి స్టార్ హీరోలందరికి కొరియోగ్రఫీ చేశారు.  ఆట,ఢీ షోల వంటి రియాల్టీ షోలు చేశారు. కామోడీ షోల్లో పాల్గొన్నారు. ఆయన శిష్యులిద్దరు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఇవాళ టాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ లు గా ఉండటం విశేషం.

వివాదాస్పద ఇంటర్వ్యూలు

గత కొన్నేళ్లుగా సిన్మాలకు దూరంగా ఉంటున్న రాకేష్ మాస్టర్ ఎక్కువగా యూట్యూబ్ ఇంటర్వ్యూలతో ఫేమస్ అయ్యారు. రాకేష్ మాస్టర్ ఇచ్చిన ఇంటర్వ్యూలన్నీ చాలా పాపులర్ అయ్యాయి. పలు యూట్యూబ్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలు వివాదాస్పదం అయ్యాయి.  ఎవ్వరికీ భయపడకుండా ఆయన చేసే వ్యాఖ్యలకు చాలా మంది అభిమానులున్నారు.. ఆయన్ని పిచ్చోడని తిట్టిన వాళ్లున్నారు. రాకేష్ మాస్టర్ ఆయన కెరీర్ ను ఆయనేపాడు చేసుకున్నారనే వాళ్లు చాలా మంది ఉన్నారు. సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని చాలా మంది డ్యాన్స్ మాస్టర్స్ తన కెరీర్ నాశనం చేశారంటూ ఆరోపణలు చేసి యూట్యూబ్ లో ఫేమస్ అయ్యారు.

 శ్రీకృష్ణుడిపై అనుచిత వ్యాఖ్యలు

రాకేష్ మాస్టర్  రామ్ గోపాల్ వర్మ, శ్రీ రెడ్డి, ఎన్టీఆర్, బాలయ్య, మోహన్ బాబు, చిరంజీవి, మంచు లక్ష్మి‌లను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. అలాగే పుల్లయ్య అనే పల్లెటూరి కుర్రాడికి రాకేష్ మాస్టర్ డ్యాన్స్‌లో కొన్నాళ్లు శిక్షణ ఇచ్చాడు. కానీ ఆ కుర్రాడు ఆ శిక్షణను మధ్యలోనే ముగించి రాకేష్  మాస్టర్ పైనే  వ్యాఖ్యలు చేయం సోషల్ మీడియాలో సంచలనాన్ని రేకెత్తించింది.  ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ శ్రీకృష్ణుడి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని  యాదవ సంఘ నాయకులు రాకేష్ మాస్టర్ పై మే 2021 నెలలో హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు

యూట్యూబ్ స్టార్లతో కామోడీ షో

రాకేష్  బిగ్ బాస్ షోకు పారడీగా ఈ మధ్యే ఒక యూట్యూబ్ ఛానెల్‌లో  మ్యాన్షన్ హౌస్ మాయా హౌస్  అని ఒక రియాలిటీ షోను రాకేష్ మాస్టర్ మొదలుపెట్టారు. అగ్గిపెట్టి మచ్చ, స్వాతినాయుడు, సునిశిత్, ఉప్పల్ బాలు వంటి యూట్యూబ్ స్టార్లతో ఈ షోను నడిపిస్తున్నారు రాకేష్ మాస్టర్.  విజయనగరం శివారులోని ఓ రిసార్ట్స్‌లో ఈ షో షూటింగ్ చేశారు.