
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్(Rakesh master) ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. ఆరోజు నుండి ఆయనపై సోషల్ మీడియాలో ఎదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. ఇక తాజాగా రాకేష్ మాస్టర్ రెండో భార్యగా చెప్పుకునే లక్ష్మి(Lakshmi)పై కొంతమంది మహిళలు దాడి చేశారు. హైదరాబాద్ లోని పంజాగుట్ట ప్రాంతంలో ఈ దాడి జరిగినట్టు సమాచారం.
లక్ష్మి తన స్కూటర్ పై వెళుతుండగా.. లల్లీ(Lalli) అనే ఒక యూట్యూబర్, మరో ఐదుగురు మహిళలు గుంపుగా వచ్చి దాడిచేశారు. నడీ రోడ్డుపై లక్ష్మిని కిందపడేసి, జుట్టుపట్టుకుని లాగుతూ, ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు ఇంఫార్మ్ చెయ్యగా వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని లక్ష్మిని స్టేషన్ కు తరలించారు. తనపై దాడిచేసిన మహిళలపై లక్ష్మి కేసు నమోదు చేశారు.
ఆతరువాత కొంత సమాయానికి యూట్యూబర్ లల్లీతో సహా.. మిగతా ఐదుగురు కూడా స్టేషన్ కు చేరుకున్నారు. ముందుగా లక్ష్మిని తమని అసభ్యంగా దూషించిందని లక్ష్మిపై కేసు పెట్టారు ఆ మహిళలు. ఇద్దరి కేసులు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారించి అక్కడి నుండి పంపించేశారు. ప్రస్తతం ఈ గొడవకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.