సవాళ్లున్నా సక్సెస్​ అవుతది : గగన్​యాన్​పై రాకేశ్​ శర్మ

సవాళ్లున్నా సక్సెస్​ అవుతది : గగన్​యాన్​పై రాకేశ్​ శర్మ

ఇస్రో చేపట్టబోయే గగన్​యాన్​ ప్రయోగం సక్సెస్​ అవుతుందని స్పేస్​లోకి వెళ్లిన మొదటి భారతీయుడు, వింగ్​ కమాండర్​ రాకేశ్​ శర్మ ధీమా వ్యక్తం చేశారు. 2022లో చేసే ఈ ప్రయోగం సవాళ్లతో కూడుకున్నదే అయినా తప్పక విజయం సాధిస్తామని ఆయన అన్నారు. ‘‘మనకు ఏదైనా సాధ్యమే. మనిషిని స్పేస్​లోకి పంపించడమన్నది సవాళ్లతో కూడుకున్నదే. వాటికి తగ్గట్టే ఇస్రో పనిచేస్తోంది. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ నడుస్తోంది. మనిషిని పంపే క్యాప్సూల్​ రెడీ అయిపోతోంది.

ప్యాడ్​ అబార్ట్​ టెస్టులు కూడా జరుగుతున్నాయి. గగన్​యాన్​ కచ్చితంగా సక్సెస్​ అవుతుందన్న నమ్మకం నాకుంది” అని ఆయన అన్నారు. ప్రయోగానికి తనవంతు సలహాలు ఇస్తున్నానని ఆయన చెప్పారు. 1984 ఏప్రిల్​ 2న సోవియట్​ యూనియన్​ (రష్యా) సోయజ్​ టీ11 ప్రయోగంలో రాకేశ్​ శర్మ స్పేస్​లోకి వెళ్లారు. ప్రస్తుతం గగన్​యాన్​ నేషనల్​ అడ్వైజరీ కౌన్సిల్​లో సభ్యుడిగా ఉన్నారు.