
ప్రగతిభవన్ లో రక్షాభందన్ వేడుకలు ఘనంగా జరిగాయి. తోబుట్టువుల ప్రేమానురాగాలు, అనుబంధాలకు వేదికగా సీఎం నివాసం నిలిచింది. సీఎం కేసీఆర్ కు ఆయన అక్కయ్యలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మ కలిసి కేసీఆర్‌కు రాఖీ కట్టి ఆశీర్వదించారు. తన తోబుట్టువులకు సీఎం కేసీఆర్ పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.
రక్షాబంధన్ వేడుకలు ప్రగతి భవన్ లో ఈరోజు ఘనంగా జరిగాయి. తోబుట్టువుల ప్రేమానురాగాలు, అనుబంధాలకు ప్రగతి భవన్ ముఖ్యమంత్రి నివాసం వేదికయింది.
— Telangana CMO (@TelanganaCMO) August 31, 2023
రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అక్కలు శ్రీమతి లక్ష్మీబాయి, శ్రీమతి జయమ్మ, శ్రీమతి లలితమ్మ, చెల్లెలు శ్రీమతి… pic.twitter.com/ZeESN4JpJP
మరోవైపు రాఖీ పండగ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎమోషనల్ ట్వీట్ చేశారు. అమ్మలోని మొదటి అక్షరం ‘అ’, నాన్నలోని చివరి అక్షరం ‘న్న’ కలిపితే నా ‘అన్న’ అంటూ మంత్రి కేటీఆర్‌తో ఉన్న ఫొటోను కవిత ట్వీట్ చేశారు. ఇక మంత్రి కేటీఆర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కు కవిత రాఖీ కట్టారు.