ప్రేమిస్తే ఆ తప్పు చేయకూడదు.. చేస్తే ఒప్పుకోవాలి

ప్రేమిస్తే ఆ తప్పు చేయకూడదు.. చేస్తే ఒప్పుకోవాలి

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakhul preet singh) ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోంది. ప్రియుడు జాకీ భగ్నానీ(jackky bhagnani)తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. ఈ మధ్యే ఒక అవార్డు ఫంక్షన్ కు కూడా ఈ ఇద్దరు జంటగా హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక తాజాగా ప్రేమ గురించి, ప్రేమ పేరుతో జరిగే మోసాలా గురించి చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. 

"నిజమైన ప్రేమకు అబద్ధం అనేది పెద్ద శత్రువు. ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉన్నప్పుడు ఏ విషయంలో దాపరికాలు అనేవి ఉండకూడదు. ఒక వేళ దాపరికాలు ఉంటే.. ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలవదు. ఇక మనిషన్నాక తప్పులు చేయడం సహజం కానీ.. చేసిన తప్పులు ఒప్పుకోవడం, అ తప్పును క్షమించగలగడం అనేది చాలా గొప్ప విషయం. ప్రేమలో ఉన్నప్పుడు ఇలాంటి తప్పులు ఒప్పుకోకపోవడం అనేది.. ఆ ప్రేమకు పెద్ద సమస్యగా మారుతుంది" అని పెద్ద ఫిలాసఫీ చెప్పుకొచ్చింది రకుల్. ప్రస్తుతం ప్రేమపై రకుల్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.