గేమ్ ఛేంజర్‌.. రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్

గేమ్ ఛేంజర్‌.. రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘RC15’లో నటిస్తున్నాడు. తమిళ డైరెక్గర్ శంకర్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నడు. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే లీకైన చరణ్‌ లుక్స్‌ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. తాజాగా ఈ సినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. మార్చి 27వ తేది సోమవారం రామ్‌ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను చిత్రబృందం ప్రకటించింది.

ఈ చిత్రానికి ‘గేమ్‌ ఛేంజర్‌’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు చిత్రం బృందం. దీనికి సంబంధించిన వీడియో గ్లింప్స్‌ను ట్విట్టర్ వేదికగా రిలీజ్‌ చేశారు. పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇందులో చరణ్‌కు జోడీగా కియారా అద్వాణి నటిస్తుంది. థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఎస్‌.జే సూర్య, సునీల్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు కార్తిక్‌ సుబ్బరాజు కథను అందించాడు.