
బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రామ్ చరణ్. శంకర్ రూపొందిస్తున్న‘గేమ్ చేంజర్’ చిత్రంలో రీసెంట్‌గా తన పోర్షన్ షూట్‌ను పూర్తి చేసిన చరణ్..త్వరలో బుచ్చిబాబు సాన కాంబోలో రానున్న RC 16 లో అడుగు పెట్టబోతున్నాడు. ఆగస్టు లేదా సెప్టెంబర్ నెల నుంచి RC 16 ని సెట్స్ మీదకు తీసుకువెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మధ్యనే ఏఆర్ రెహమాన్ బుచ్చి బాబుతో కలిసి ఉన్న ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇప్పటికే మూడు సాంగ్స్ ఫైనల్ చేశారట. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఆ మూడు పాటలు బుచ్చిబాబుతో సహా టీం కి బాగా నచ్చాయని తెలుస్తోంది.
స్పోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో రా అండ్ రిస్ఠిక్‌గా తెరకెక్కుతోన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ నటిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే ఈ మూవీలో కన్నడ శివన్న,కోలీవుడ్ విజయ్ సేతుపతి, మలయాళ యాక్టర్ ఆర్‌డీఎక్స్ ఫేమ్ ఆంటోనీ వర్గీస్ జాయిన్ కాబోతున్నారు. దీన్ని బట్టి చూస్తే..బుచ్చిబాబు తెలుగు, కన్నడ, తమిళ,హిందీ, భాషలకు చెందిన స్టార్ హీరోలు..యాక్టర్స్ ను పలు కీలక పాత్రల కోసం ఎంపిక చేస్తున్నట్లు టాక్. అయితే, ఈ సినిమా పాన్ ఇండియాను మించి ఉండేలా బుచ్చిబాబు గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు సినీ సర్కిల్ లో గుసగుసలు మొదలయ్యాయి.
RC16 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kappoor) హీరోయిన్ గా నటిస్తుండగా..ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ (AR Rahaman) సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
#RC16 core team is working at the best-in-class Firdaus Studio, Dubai to take Indian Cinema to the Global Level ❤️?#RamCharanRevolts https://t.co/xR2Vm37EzU
— Mythri Movie Makers (@MythriOfficial) July 14, 2024