ఆర్చరీ ప్రీమియర్ లీగ్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా రామ్‌‌‌‌‌‌‌‌చరణ్‌‌‌‌‌‌‌‌

ఆర్చరీ ప్రీమియర్ లీగ్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా రామ్‌‌‌‌‌‌‌‌చరణ్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా ఆర్చరీకి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకురావాలనే లక్ష్యంతో దేశంలో తొలిసారి ఆర్చరీ ప్రీమియర్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌ (ఏపీఎల్‌‌‌‌‌‌‌‌) ప్రారంభం కానుంది. ఢిల్లీలో అక్టోబర్ 2 నుంచి 12 వరకు జరిగే లీగ్‌‌‌‌‌‌‌‌లో ఆరు జట్లు పాల్గొంటాయి. కాకతీయ నైట్స్ (తెలంగాణ), పృథ్వీరాజ్ యోధాస్ (న్యూఢిల్లీ), మైటీ మరాఠాస్ (మహారాష్ట్ర), రాజపుతానా రాయల్స్ (రాజస్తాన్), ఛెరో ఆర్చర్స్ (జార్ఖండ్), చోళా చీఫ్స్ (తమిళనాడు) పోటీ పడనున్నాయి. ఈ లీగ్‌‌‌‌ కోసం డ్రాఫ్ట్ ద్వారా ప్రతి జట్టులో ఎనిమిది మంది ఆర్చర్లను ఎంపిక చేసుకున్నారు.  

వీరిలో 36 మంది ఇండియా ఆర్చర్లు, 12 మంది ఇంటర్నేషనల్ ఆర్చర్లు ఉన్నారు. తెలంగాణ అమ్మాయి తానిపర్తి చికిత చోళా చీఫ్స్‌‌‌‌‌‌‌‌ జట్టులో చోటు దక్కించుకుంది. స్టార్ ఆర్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జ్యోతి సురేఖ కాకతీయ నైట్స్ తరఫున బరిలోకి దిగనుంది. ఇక, ఈ ప్రతిష్టాత్మక లీగ్‌‌‌‌‌‌‌‌కు గ్లోబల్‌‌‌‌‌‌‌‌ స్టార్ రామ్‌‌‌‌‌‌‌‌చరణ్‌‌‌‌‌‌‌‌ను బ్రాండ్‌‌‌‌‌‌‌‌ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా నియమించినట్లు ఆర్చరీ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రకటించింది.