గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ముంబైకి వెళ్లిన చరణ్ కొత్త స్టైలిష్ లుక్లో దర్శనమిచ్చారు. బాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ హకీమ్ ఆలిమ్ సెలూన్‌కు రామ్ చరణ్ వెళ్లడంతో ఫోటోలు వైరల్గా మారాయి. అయితే అందరి చూపు ఆయన కుడి చేతి మణికట్టుపై ఉన్న సపోర్ట్ బ్రేస్‌పైనే పడింది. చరణ్ కుడి చేతికి రిస్ట్ బ్యాండేజ్ (సపోర్ట్ బ్రేస్) ధరించి కనిపించడంతో మెగా ఫ్యాన్స్లో ఆందోళన మొదలైంది.
During #Magadheera, @AlwaysRamCharan suffered a hand injury, and since then he has been dealing with strain pain.
— RamCharan Fans™️ (@RamCharan_HCF) May 16, 2026
For the action sequences in #Peddi, he had to wrestle and roll over pehlwans throughout the shoot. By the end of the day, he wouldn’t even have the strength to lift… pic.twitter.com/O20iMAAIao
అయితే, పెద్ది షూటింగ్‌లో యాక్షన్ సీక్వెన్స్ సమయంలో చిన్నపాటి మణికట్టు గాయం అయినట్లు సమాచారం. వైద్యుల సూచన మేరకు, ఈ గాయం నుంచి త్వరగా కోలుకోవడానికి ముందు జాగ్రత్తగా బ్యాండేజ్ ధరించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ చిన్నపాటి గాయం వల్ల పెద్ది షెడ్యూల్స్‌పై ఎలాంటి ప్రభావం లేదని టాక్.
మే 18న జరగనున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొనడానికి చరణ్ క్యూరియాసిటీతో ఉన్నట్లు పెద్ది మేకర్స్ చెబుతూ వస్తున్నారు. గేమ్ ఛేంజర్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత, సాలిడ్ కంటెంట్తో వస్తుండటంతో చరణ్ సైతం ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ట్రైలర్ వచ్చాక పెద్ది కాన్సెప్ట్పై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Dapper looks on point 🔥🔥
— ANANTAPUR CINEMA (@AnantapurCinema) May 15, 2026
Mega Power Star @AlwaysRamCharan spotted at Hakim Aalim’s salon in Bandra. 😎#PEDDI #RamCharan pic.twitter.com/SXOhrOO3Cu
పెద్ది ఈవెంట్స్..
బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ‘పెద్ది’పై అతిభారీ అంచనాలున్నాయి. విడుదలకు ముందే ఈ మూవీ టాలీవుడ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కేవలం రెండు సాంగ్స్, ఫస్ట్ షాట్ టీజర్, ఫ్రైల్వాన్ గ్లింప్స్‌లతోనే ప్రకంపనలు సృష్టించింది. ఇదే సమయంలో తమ క్రేజీ ప్రమోషన్లతో మరింత హీట్ పెంచనుంది. జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమా కోసం కేవలం 15 రోజుల్లోనే దేశంలోని ప్రధాన నగరాలను చుట్టేయనున్నారు.
ఈ యాత్ర మే 18న ముంబైలో మొదలవుతుంది. అక్కడ అత్యంత భారీగా ‘పెద్ది’ ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నారు. మే 22న ఉప్పల్ స్టేడియంలో రామ్ చరణ్ సందడి చేయబోతున్నారు. అదే వేదికపై ఏఆర్ రెహమాన్ లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్, మే 23న భోపాల్‌లో మ్యూజికల్ ఈవెంట్లో పెద్ది స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. విజయనగరంలో జూన్ 1న అభిమానులతో గెట్-టుగెదర్ ఏర్పాటు చేయనున్నారు. ఇక ఫైనల్ గా జూన్ 2న హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీరిలీజ్ వేడుకను ఏర్పాటు చేయనున్నారు.
MUMBAAAIIIII, Remember his name #PEDDI, he is coming 💥💥#PEDDI Trailer Takeover from May 18th, More details soon❤️🔥#PEDDI WORLDWIDE RELEASE IN CINEMAS ON JUNE 4th❤️🔥 pic.twitter.com/9EZfM1LnGV
— PEDDI (@PeddiMovieOffl) May 13, 2026
