V6 News

జనసేన ఓటమిపై రాం చరణ్ స్పందన

జనసేన ఓటమిపై రాం చరణ్ స్పందన

ఏపీలో నిన్న విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను పోటీచేసిన రెండు స్థానాల్లోనూ  ఘోరపరాజయం పాలయ్యాడు.  ఈ ఓటమిపై, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఫేస్ బుక్  వేదికగా స్పందించారు.

“గొప్ప నాయకులు కేవలం నాయకులుగానే మిగిలిపోరు, మార్పు అంటే ఏంటో చూపిస్తారు. ఇది ఓ పాత్రకు సంబంధించిన విషయం కాదు, ఇదంతా ఓ లక్ష్యానికి సంబంధించిన విషయం” అంటూ పోస్టు పెట్టారు. ఈ ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్ గారికీ, జనసేన పార్టీకి సేవలు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ తన పోస్టులో పేర్కొన్నారు.