ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్.. ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నారు. జులై లేదా ఆగస్టు నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇది ఇంకా సెట్స్‌కు వెళ్లకముందే మరో కొత్త సినిమాను రామ్ చరణ్ లైన్‌లో పెట్టినట్టు సమాచారం. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో ఈ సినిమా ఉండబోతోంది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో హిస్టారికల్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రానికి ‘గుల్లాక్’ సిరీస్ ఫేమ్ దుర్గేష్ సింగ్ స్క్రిప్ట్‌ను అందిస్తున్నారు.
భన్సాలీ నిర్మాతగా ‘రౌడీ రాథోర్ 2’ (విక్రమార్కుడు సీక్వెల్) కోసం విజయేంద్ర ప్రసాద్ ఓ స్క్రిప్ట్ రెడీ చేయగా ఆ ప్రాజెక్ట్ ముందుకెళ్లలేదు. అదే కథపై దుర్గేష్ రీ వర్క్ చేసి ఈ స్క్రిప్ట్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. హీరోయిజం, యాక్షన్ మేళవింపుతో రూపొందే ఈ చిత్రాన్ని హిందీలో చిత్రీకరించి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ చేసి విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం. ఇక గతంలో రామ్ చరణ్, సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్‌లో మహారాజా సుహెల్ దేవ్ జీవితం ఆధారంగా ఓ హిస్టారికల్ మూవీ ప్లాన్ చేసినప్పటికీ మెటీరియలైజ్ అవలేదు. ఆ స్థానంలో ఇప్పుడు ఈ సినిమా రాబోతోంది.
