కోరమీసంతో డిఫరెంట్ లుక్ లో రామ్ చరణ్

కోరమీసంతో డిఫరెంట్ లుక్ లో రామ్ చరణ్

‘ఆర్ఆర్ఆర్’ పూర్తి కాకముందే శంకర్ డైరెక్షన్ లో సినిమా స్టార్ట్ చేసేశాడు రామ్ చరణ్. ప్రస్తుతం ఆ షూటింగ్ లోనే బిజీగా ఉన్నాడు. ఇది తన పదిహేనో సినిమా. దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న యాభయ్యో మూవీ. తన మార్క్ సోషల్ మెసేజ్ తో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు శంకర్. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే కొన్ని స్టిల్స్ లీకయ్యాయి. వాటిలో చరణ్ ను సరికొత్త లుక్ లో చూసి మెగా ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు. వాళ్లని మరింత సంతోష పెట్టడానికి నిన్న తన  న్యూ లుక్ కి సంబంధించి ఓ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు చరణ్.

ఫుల్ గా హెయిర్ పెంచి.. గడ్డం, కోరమీసంతో డిఫరెంట్ లుక్ లో ఉన్నాడు. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ స్టన్నింగ్ లుక్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయిపోయింది. ఇందులో  చరణ్ తండ్రీ కొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడని టాక్. ఓ పాత్ర గవర్నమెంట్ ఆఫీసర్ కావడంతో మొదట ‘అధికారి’ అనే టైటిల్ పెడుతున్నారని వార్తలు వచ్చాయి. కానీ తర్వాత ‘సిటిజన్’ అనే పేరు ఫిక్స్ చేసినట్లు తెలిసింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో  జయరామ్, సునీల్, అంజలి, నవీన్చం ద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.