
హీరో రామ్‌చరణ్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (ఐఎఫ్‌ఎఫ్‌ఎం) 15వ ఎడిషన్‌కు రామ్ చరణ్‌ను గౌరవ అతిథిగా ప్రకటించారు. ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ బ్రాండ్ అంబాసిడర్ అవార్డును ఆయన అందుకోబోతున్నాడు. ఈ అవార్డును అందుకోనున్న తొలి ఇండియన్ సెలబ్రిటీగా రామ్‌చరణ్ నిలవనున్నాడు.
దీనిపై చరణ్ స్పందిస్తూ.. ‘ఇందులో భాగం కావటం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మన సినిమా ఇండస్ట్రీ తరపున ప్రాతినిధ్యం వహించడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రముఖులతో కనెక్ట్ అవడం సంతోషంగా ఉంది’ అని చెప్పాడు. ఐఎఫ్ఎఫ్ఎమ్ అనేది ఆస్ట్రేలియాలోని విక్టోరియన్ స్టేట్ గవర్నమెంట్ ప్రతి ఏడాది నిర్వహించే ఫిల్మ్ ఫెస్టివల్. ఆగస్టు 15 నుంచి 25 వరకూ ఈ వేడుకలు జరగనున్నాయి.