అన్ని రంగాల్లో అభివృద్ధి.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై చరణ్‌ ట్వీట్‌

అన్ని రంగాల్లో అభివృద్ధి.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై చరణ్‌ ట్వీట్‌

తెలంగాణా రాష్ట్రం(Talangana state) అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నాం అంటూ ట్వీట్ చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan ). జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం(Telangana formationday ) సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపాడు రామ్ చరణ్. 

ఇందులో భాగంగా.. "తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు అవుతోంది. ఈ పదేళ్లలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి, బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నాం. తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి నా శుభాకాంక్షలు’ అని రామ్‌ చరణ్‌ ట్వీట్‌ చేశాడు.  ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక తెలంగాణ రాష్ట్రం పదో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట ప్రభుత్వం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. 21 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో రోజుకో రంగం చొప్పున ప్రత్యేక కార్యక్రమాలతో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం.