
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun)కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు(National award) అందుకున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన 69వ జాతీయ అవార్డ్స్(69th National awards) లో పుష్ప సినిమాకు గాను ఆయన ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. 70 ఏళ్ళ తెలుగు సినీ చరిత్రలోఉత్తమ నటుడు అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డ్స్ క్రియేట్ చేశారు అల్లు అర్జున్. దీంతో ఆయనకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. టాప్ సెలబ్రేటీలు సైతం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ బహుమతులు పంపుతున్నారు.
ఇందులో భాగంగానే తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan), ఉపాసన(Upasana) దంపతులు కూడా అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రత్యేకమైన ఒక పూల బొకేను పంపారు. దానితో ఆటు ఒక స్పెషల్ నోట్ కూడా పంపారు. అందులో.. డియర్ బన్నీ.. కంగ్రాట్స్.. నిన్ను చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటివి నిన్ను ఇంకా ఎన్నో వరిస్తాయి. అందుకు నీవు అర్హునివి అని రాసుకొచ్చారు.
దానికి అల్లు అర్జున్ కూడా ఎమోషనల్ రిప్లై ఇచ్చాడు.. థాంక్యూ సో మచ్.. టచ్ చేశారంటూ రాసుకొచ్చారు బన్నీ. ఈ పోస్ట్ ను తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేశాడు అల్లు అర్జున్ . ప్రస్తుతగం ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.