శతావతారాల్లో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ కోసం శంకర్ భారీ స్కెచ్

శతావతారాల్లో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ కోసం శంకర్ భారీ స్కెచ్

ఆర్ఆర్ఆర్(RRR) భారీ సక్సెస్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) నుండి వస్తున్న మూవీ గేమ్ ఛేంజర్(Game changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ సినిమాపై నేషనల్ వైడ్ గా భారీ హైప్ క్రియేట్ అవుతోంది. అందుకే గేమ్ ఛేంజర్ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది.

ఇక తాజాగా గేమ్ ఛేంజర్ మూవీ  నుండి వినిపిస్తున్న న్యూస్ ఒకటి తెగ ట్రెండ్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో రామ్ చరణ్ మొత్తం ఏడు అవతారాల్లో కనిపించనున్నాడట. శంకర్ సినిమాల్లో హీరోలు కథానుసారం వివిధ గెటప్స్ లో కనిపించడం మామూలే. ఇప్పుడు రామ్ చరణ్ కోసం కూడా అదే పంధాను ఫాలో అవుతున్నాడట శంకర్. ఆ ఏడు గెటప్స్ లో ఒకటి ఐఏఎస్ అధికారి పాత్ర కాగా.. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్ర. ఈ రెండిటికి సంబంధించిన ఫొటోస్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా రామ్ చరణ్ ఏడు అవతారాల్లో కనిపించనున్నాడు అనే విషయం తెలియడంతో గేమ్ ఛేంజర్ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మెగా ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ఇక గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara advani) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి(Anjali), శ్రీకాంత్(Srikanth), సునీల్(Sunil), నవీన్ చంద్ర(Naveen chandra) తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil raju) భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్(thaman) సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.