పెద్దిలో నెవర్ బిఫోర్ లుక్‌‌లో చరణ్

పెద్దిలో  నెవర్ బిఫోర్ లుక్‌‌లో చరణ్

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన  రూపొందిస్తున్న చిత్రం ‘పెద్ది’.  ఇందులో చరణ్  నెవర్ బిఫోర్ లుక్‌‌తో మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నట్టు టీమ్ అప్‌‌డేట్ ఇచ్చింది. దీనికోసం  టాప్ సెలబ్రిటీ స్టైలిస్ట్ ఆలీం హకీం స్పెషల్ కేర్ తీసుకొని చరణ్‌‌ను  సరికొత్త లుక్‌‌లో ప్రెజంట్ చేయబోతున్నాడు.  రామ్ చరణ్ స్టైల్, స్వాగ్‌‌లో కొత్త బెంచ్‌‌మార్క్‌‌ను క్రియేట్ చేయనున్నారని మేకర్స్ తెలియజేశారు.

 రీసెంట్‌‌గా స్టైలిస్ట్ ఆలీం హకీం, రామ్ చరణ్‌‌తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  స్పోర్ట్స్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో  జాన్వీ కపూర్ హీరోయిన్‌‌గా నటిస్తుండగా,  శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం  మార్చి 27  రామ్ చరణ్   పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది.  ఇప్పటికే సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్‌‌తో  హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.