
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రికెట్ జట్టును కొనడానికి సిద్దమయ్యాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక చరణ్ క్రికెట్ జట్టుని కొంటున్నాడు అని తెలియగానే.. ఏ టీంని కొంటున్నాడు? కొత్త టీం ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా? ఐపీఎల్ కోసమా లేదా వేరే లీగ్ ఏదైనా మొదలుపెడుతున్నారా? అని సర్చింగ్ మొదలుపెట్టేశారు ఫాన్స్.
ఇంతకి అసలు విషయం ఏంటంటే.. రామ్ చరణ్ క్రికెట్ టీం కొంటున్న మాట నిజమే కానీ అది ఐపీఎల్ కోసం కాదు ఏపీఎల్ కోసం. ఏపీఎల్ అంటే.. ఆంధ్రా ప్రీమియర్ లీగ్. ఆంధ్రప్రదేశ్ లోని యువ క్రికెటర్లను ప్రోత్సహించే దిశగా ఏర్పాటు చేసిన ఈ లీగ్ తొలి సీజన్ సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఈ లీగ్ లోని ఫ్రాంచైజీలను పలువురు వ్యాపారవేత్తలు కొనుగోలు చేశారు. మొత్తం ఆరు జట్లతో గత ఏడాది మొదలైన ఈ లీగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మొదటి సీజన్ తర్వాత.. పలువురు యువ క్రికెటర్లు కూడా వెలుగులోకి వచ్చారు. ఇందులో బాగంగానే తరువాతి సీజన్ కోసం రామ్ చరణ్ ఒక జట్టుని కొనడానికి రెడీ అయ్యాడట. అది కూడా వైజాగ్ వారియర్స్ టీంను. దీనికి సంబంధించి వైజాగ్ వారియర్స్ యాజమాన్యంతో చర్చలు ఇప్పటికే జరిగినట్లుగా తెలుస్తోంది.
ఇదే విషయాన్ని వైజాగ్ వారియర్స్ ఫ్రాంచైజీ ఓనర్లు శ్రీనుబాబు, నరేంద్ర రామ్, భరణిలను మీడియా ప్రశ్నించగా.. రాంచరణ్ ఏపీఎల్ లో భాగమైతే యువ ఆటగాళ్ల కు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. డీల్ కు సంబంధించిన వివరాల్ని త్వరలో వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు. ఇవన్నీ చూస్తుంటే.. క్రికెట్ జట్టు కొనుగోలు విషయంలో రాంచరణ్ సీరియస్ గానే ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక సినిమాల్లో హీరో గా ఫుల్ బిజీగా ఉంటూనే.. మరోపక వ్యాపారాలు కూడా చూసుకుంటున్నాడు చరణ్. ఇప్పటికే ఆయనకు హోటల్,ఎయిర్ లైన్స్,హాస్పటల్ వంటి పలు వ్యాపారాలున్న ఉన్న సంగతి తెలిసిందే.