
ఓవైపు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గ్లోబల్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న రామ్ చరణ్.. మరోవైపు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాన్ని కంప్లీట్ చేస్తున్నాడు. చరణ్‌కి జంటగా కియారా అద్వాని నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే సర్కారోడు, అధికారి లాంటి టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా మరో టైటిల్ తెరపైకొచ్చింది. అదే ‘సి.ఈ.ఓ’. ఇందులోని ఓ పాత్రలో పొలిటీషియన్‌గా నటిస్తున్న చరణ్, మరో పాత్రలో ఎలెక్షన్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. దీంతో చీఫ్ ఎలెక్షన్ ఆఫీసర్ అనే అర్థంలో ఈ టైటిల్‌ను నిర్ణయించబోతున్నట్టు తెలుస్తోంది. ఇంగ్లీష్ టైటిల్ కనుక ఇతర భాషల్లోనూ ఒకే టైటిల్‌తో రావొచ్చని భావిస్తున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఈనెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో.. బర్త్ డే సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు టాక్. సునీల్, ఎస్.జె.సూర్య, అంజలి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.