‘రాజయోగం’ చిత్రంతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న రామ్ గణపతి హీరోగా నటిస్తున్న చిత్రం ‘కాలం’. అంకిత సాహా హీరోయిన్. వెంకట సురేష్ దర్శకత్వంలో మణి లక్ష్మణరావు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
అతిథులుగా హాజరైన హీరో సాయి రోనక్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. రామ్ గణపతి మాట్లాడుతూ ‘టైమ్ ట్రావెల్ నేపథ్యంతో కాలం విలువ చెప్పేలా ఈ సినిమాను రూపొందించాం’ అని చెప్పాడు. ఈ మూవీ కాన్సెప్ట్ కరెక్ట్‌గా అర్థం కావాలంటే ప్రతి సన్నివేశాన్ని మిస్ కాకుండా చూడాలని దర్శక నిర్మాతలు చెప్పారు. హీరోయిన్ అంకిత సాహాతోపాటు టీమ్ అంతా పాల్గొన్నారు.
