పప్పు తినే వాళ్ళకే ఇలాంటి ఐడియాలు వస్తాయి

పప్పు తినే వాళ్ళకే ఇలాంటి ఐడియాలు వస్తాయి

క్రియేటీవ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram gopal varma) నారా లోకేష్(Nara lokesh) కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర రాజకీయాలపై ఒక సినిమా తియ్యబోతున్నట్లు కొద్దిరోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాలో మొదటి భాగానికి ‘వ్యూహం’(Vyooham), రెండో భాగానికి ‘శపథం’ అనే టైటిల్స్ ఫిక్స్ చేశాడు వర్మ. 

రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయ్యింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ షూటింగ్ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు వర్మ. రిలీజైన కొన్ని క్షణాల్లోనే ఈ ఫొటోస్ ఫుల్ వైరల్ అయ్యాయి. దీంతో ఈ ఫొటోస్ కు టీడీపీ యువనేత లోకేష్ రియాక్ట్ అయ్యారు.. అందులో ఒక ఫోటోను పోస్ట్ చేస్తూ దానికి.. "వ్యూహంలో రెండో సీన్ లీక్.. తెలవారుజామున మూడు గంటలకు బాబాయి మర్డర్ గురించి డిస్కషన్.. అవినాష్ రెడ్డి కాల్ తరువాత" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. 

ఇక నారా లోకేష్ చేసిన పోస్ట్ కు వ్యూహం దర్శకుడు అర్జీవీ రెస్పాండ్ అయ్యారు. "వావ్! మీ గొర్రెల బ్యాచ్ అనుకుంటున్నట్టు నేను వాళ్ళకే ఫేవర్ చేస్తే, ఈ కంటెంట్ ఎందుకు పెడతాను? ఇలాంటి ఐడియాలు పప్పు ఎక్కువ తినేవాల్లకే వస్తాయి" అంటూ కామెంట్స్ చేసాడు వర్మ. ప్రస్తుతం వర్మ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.