బస్తీ మే సవాల్- NTR అభిమానులకు ఆహ్వానం

V6 Velugu Posted on May 24, 2019

మాజీ సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విషయంలో కొన్ని నెలలుగా టీడీపీకి, వర్మకు మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.  ఆ సినిమాను విడుదలకానివ్వలేదు కాబట్టే బాబును ఓడించానని ఎన్టీఆర్ తనకు కలలోకి వచ్చి చెప్పాడన్న వర్మ అసెంబ్లీ ఫలితాలు విడుదలైనప్పటి నుంచి తెగ ట్వీట్లు చేస్తున్నాడు.

తన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్  ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసమని విజయవాడకు వచ్చిన ఆర్జీవీని బాబు అడ్డుకున్నారు.  విజయవాడ విమానాశ్రయం వద్దే  తమ ప్రభుత్వం చేత అరెస్ట్ చేయించి,  వెనుతిరిగేలా చేశారు . ఈ క్రమంలో ఏపీలో తన సినిమాను విడుదల కాకుండా అడ్డుకున్నందుకు చంద్రబాబుకు  శుక్రవారం ట్విటర్ ద్వారా సవాల్ విసిరారు RGV. తాను మే 25న తాను విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టబోతున్నానని ప్రకటించాడు. నిజమైన NTR అభిమానులు తన మీట్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు.

“ఎక్కడయితే Ex CM నన్ను అరెస్ట్ చేయించి విజయవాడ నుంచి వెళ్లగొట్టారో అదే పైపుల రోడ్డులో NTR circle దగ్గర ఎల్లుండి ఆదివారం 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నాము. బస్తి మే సవాల్ !!! ఎన్ టి ఆర్ నిజమయిన అభిమానులకి , ఇదే నా బహిరంగ ఆహ్వానం..జై జగన్” అంటూ RGV ట్వీట్ చేశారు.

Tagged Challenge, Invitation, RGV, NTR fans, ఢhandrababu naidu

Latest Videos

Subscribe Now

More News