మరోసారి వివాదంలో రాంగోపాల్ వర్మ.. రాయదుర్గంలో కేసు నమోదు

మరోసారి వివాదంలో రాంగోపాల్ వర్మ.. రాయదుర్గంలో కేసు నమోదు

గచ్చిబౌలి, వెలుగు: డైరెక్టర్​రామ్​గోపాల్​వర్మ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తన అనుమతి లేకుండా 'దహనం' వెబ్​సిరీస్​లో తన ఐడెంటిటీని ఉపయోగించారని రిటైర్డ్​ఐపీఎస్​ఆఫీసర్ అంజనా సిన్హా​రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రామ్​గోపాల్​వర్మ​పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

2022లో దహనం వెబ్​సిరీస్​ వచ్చింది. ఈ సిరీస్​కు డైరెక్టర్​రామ్​గోపాల్​వర్మే నిర్మాతగా వ్యవహరించారు. ఎంఎక్స్ ప్లేయర్​లో విడుదలైన ఈ వెబ్​సిరీస్​ను కొద్దిరోజులకు తొలగించారు. ఈ సిరీస్​లో నక్సలైట్లకు, ప్యూడలిస్టులకు మధ్య జరిగే పోరాటాన్ని తెరకెక్కించారు. 1990 ఏపీ బ్యాచ్​కు చెందిన ఐపీఎస్​ఆఫీసర్​అంజనా సిన్హా డీఐజీ, ఏడీజీపీ హోదాల్లో పనిచేశారు. 

ఈ వెబ్​సిరీస్​లో అంజనా సిన్హా ఐడెంటిటీని ఉపయోగించారు. దీంతో తాను దహనం వెబ్​సిరీస్ నిర్మాత, దర్శకుడిని ఎప్పుడూ కలవలేదని, మాట్లాడలేదని, తన అనుమతి లేకుండా తన పాత్రను సిరీస్​లో చూపించారన్నారు. తన వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లిందని, రామ్ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో రామ్​గోపాల్​వర్మపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు