వర్మ డెన్ లోకి ఆడ పులి.. రెండు రోజులుగా రచ్చ రచ్చ

వర్మ డెన్ లోకి ఆడ పులి.. రెండు రోజులుగా రచ్చ రచ్చ

టాలీవుడ్ క్రియేటీవ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రీసెంట్‌గా హైదరాబాద్‌లో "ఆర్జీవీ డెన్" పేరుతో కొత్త ఆఫీస్ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ఈ కొత్త ఆఫీస్ నుండే వర్మ తన కొత్త సినిమాలకు సంబందించిన పనులు జరగనున్నాయి. ఇక ఆఫీస్ మొత్తాన్ని వర్మ లైఫ్ లో జరిగిన మోస్ట్ మెమరబుల్ ఫొటోస్ తో నింపేసాడు. 

అంతేకాదు.. ఈ ఫొటోస్లో వర్మ అమ్మాయిలతో దిగిన ఫొటోస్ కూడా దర్శనమిచ్చాయి. అందులో.. మియా మాల్కోవా, అప్సరా రాణి, నైనా గంగూలీ, ఇరా మోర్ వంటి గ్లామరస్ హీరోయిన్ ఫొటోస్ ఉన్నాయి. అమ్మాయిలంటే తనకు చాలా ఇష్టమని వర్మ.. ఆ కామెంట్ కు జస్టిఫికేషన్ ఇచ్చుకున్నాడు.  

ఇక తాజాగా ఆర్జీవీ డెన్‌లో బోల్డ్ బ్యూటీ అప్సర బికినీ ధరించి అందాల రచ్చ చేసింది. ఈ హాట్ బ్యూటీతో దిగిన ఫోటోలను వర్మ తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేయగా.. నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘‘గురువుగారు ఆమెకు ఒక మంచి పట్టు చీర కొనివ్వండి, ఎప్పుడు చూసినా బట్టలు లేకుండా కనిపిస్తుందంటూ కొందరు కామెంట్ చేస్తుంటే.. సుఖపురుషుడివి వర్మ.. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో అంటూ మరికొందరు కామెంట్ల చేస్తున్నారు. ప్రస్తుతం వర్మ షేర్ చేసిన ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి