జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే అసలైన మగాడు.. ఆర్జీవీ సెన్సేషనల్ కామెంట్స్

జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే అసలైన మగాడు.. ఆర్జీవీ సెన్సేషనల్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో మే 28 సీనియర్ ఎన్టీఆర్ జయంతి సంధర్బంగా ఎన్టీఆర్ విఙ్ఞాన ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి సభ ఏర్పాటు చేసారు. ఈ సభకి డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, మాజీ మంత్రి వెల్లంపల్లి, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, పలువురు ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. “నేను మీ అందరికీ ఒక జోక్ చెప్పటానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ జోక్ జరుగుతోంది. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ కు కూడా నవ్వాలో, ఏడవాలో అర్ధం కాని పరిస్థితి. చంద్రబాబు ఎలాంటి వాడు అనేది స్వయంగా ఎన్టీఆర్  చెప్పారు. లక్ష్మి పార్వతి మాయలో ఎన్టీఆర్ పడ్డారు అంటుంటారు. అంటే ఎన్టీఆర్ కు అవగాహన లేదా? అవగాహన లేని వ్యక్తికి దండలు ఎందుకు వేస్తున్నారు? 

చంద్రబాబు పక్కన రజనీకాంత్ కూర్చుని ఎన్టీఆర్‌ను పొగడటం అంటే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవటమే. ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళతో పాటు వేదిక పంచుకోకుండా ఒక విధానానికి కట్టుబడి ఉన్నాడు” అంటూ కామెంట్స్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తతం వర్మ చేసిన ఈ కామెంట్స్ అటు టీడీపీ వర్గాల్లో, అటుసోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.