AndhraKingTaluka: రామ్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. సూపర్ స్పెషల్ మెలోడీ వచ్చేస్తోంది

AndhraKingTaluka: రామ్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. సూపర్ స్పెషల్ మెలోడీ వచ్చేస్తోంది

రామ్ పోతినేని హీరోగా ‘మిస్ శెట్టి మిస్టర్  పోలిశెట్టి’ఫేమ్  పి.మహేష్ బాబు రూపొందిస్తున్న చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. రామ్ కెరీర్‌‌‌‌లో ఇది 22వ సినిమా. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌‌లో కీలకమైన నెల రోజుల షెడ్యూల్ జరుగుతోంది. చిత్రీకరణ చివరి దశకు చేరుకోవడంతో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. జులై 18న ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌లో రామ్ ఉత్సాహంగా తెరచాపతో నాటు పడవపై ప్రయాణిస్తున్నట్లు కనిపించాడు. ఈ ఫస్ట్ సింగిల్ మెలోడీగా రానుంది.  

వివేక్ - మెర్విన్ ద్వయం స్వరపరిచిన సౌండ్‌‌ట్రాక్ మ్యూజిక్ లవర్స్‌‌ని అలరించనుందని మేకర్స్ చెప్పారు. ఈ చిత్రంలో రామ్ రిఫ్రెషింగ్ గెటప్‌‌లో సినిమా అభిమానిగా కనిపించనున్నాడు.

ఇప్పటికే విడుదలైన తన లుక్‌‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.  రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.