దారుణంగా ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ డే కలెక్షన్స్: డబుల్ ఇస్మార్ట్, స్కంద సినిమాల కంటే తక్కువే

దారుణంగా ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ డే కలెక్షన్స్: డబుల్ ఇస్మార్ట్, స్కంద సినిమాల కంటే తక్కువే

హీరో రామ్ నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా (Andhra King Taluka) మిక్సెడ్ టాక్తో రన్ అవుతోంది. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ, తొలిరోజు పెద్దగా చెప్పుకోదగ్గ వసూళ్లను రాబట్టలేకపోయింది. గురువారం నాడు (ఫస్ట్ డే) ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ. 4.25 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలలో మొత్తంగా రూ.2.75 కోట్ల నెట్ సాధించగా.. మిగతా రాష్ట్రాలలో రూ. 0.25 కోట్లు, ఓవర్సీస్లో రూ.1.25 కోట్ల నెట్ అందుకుంది.

ఇకపోతే, ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే.. అటు ఇటుగా రూ.7.65 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ నిపుణుల అంచనాలు చెబుతున్నాయి. ఇవాళ సాయంత్రం లోగా మేకర్స్ ఫస్ట్ డే గ్రాస్ వసూళ్లను ప్రకటించే అవకాశం ఉంది. 

అయితే, రామ్ గత డిజాస్టర్ సినిమాలైనా డబుల్ ఇస్మార్ట్, స్కంద సినిమాలను ఆంధ్రా కింగ్ తాలూకా అధిగమించలేకపోయింది. స్కంద ఫస్ట్ డే ఇండియా బాక్సాఫీస్ దగ్గర రూ.11.5కోట్ల నెట్, రూ.18.2 కోట్ల గ్రాస్.. అలాగే డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ డే రూ.7.35 కోట్ల నెట్, రూ.12 కోట్ల గ్రాస్ సాధించాయి. కనీసం, డబల్ ఇస్మార్ట్ తొలిరోజు సాధించిన ఇండియా నికర కలెక్షన్ను కూడా ఆంధ్రా కింగ్ తాలూకా (రూ.4.25 కోట్లు) అందుకోలేకపోయింది. ఇది రామ్ ఫ్యాన్స్ ను మరింత డిస్సపాయింట్ కలిగించే అంశం. మరి ఈ వీకెండ్ పెర్ఫార్మన్స్ అద్భుతం జరిగితే మాత్రం రామ్ బయట పడతాడు. లేదంటే రామ్ ఖాతాలో  మరో ఫెయిల్యూర్ అనుకోవొచ్చని ట్రేడ్ వారగులు భావిస్తున్నాయి.  

ALSO READ :  కూతురు పేరు ప్రకటించిన హీరోయిన్ కియారా అద్వానీ..

ఇదిలా ఉంటే.. సినిమా లాంచ్ అయిన రోజు నుంచి రిలీజ్ అయ్యేవరకు పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసుకుంది. కానీ, మేకర్స్ అంచనాలను తారుమారు చేస్తూ ఆంధ్రా కింగ్ తాలూకా మొదటి రోజు వసూళ్లలో అంచనాలు అందుకోలేకపోయింది. అయితే, యూఎస్ మార్కెట్లో మాత్రం మంచి ఓపెనింగ్స్ అందుకుంది. అక్కడ ఈ సినిమా $275K+ (2 లక్షల 75 వేల డాలర్స్) కలెక్షన్స్తో దోసుకెళ్తోంది. అంటే.. మన ఇండియా కరెన్సీ లో చూసుకుంటే.. 2 కోట్ల 46లక్షలకి పైగా సాధించింది.

సో వీకెండ్కి మరింత వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఆంధ్రా కింగ్ తాలూకా హిట్ అవ్వాలంటే సుమారు రూ.28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవాలి. అంటే సినిమా ఇంకా 23.75 కోట్ల రేంజ్లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది.

కథగా... 

సాగర్‌‌ (రామ్) దారి తీరు లేని ఓ లంక గ్రామం నుంచి వచ్చి టౌన్‌లో పాలిటెక్నిక్ చదివే సాదాసీదా కుర్రాడు. కానీ స్టార్ హీరో సూర్య (ఉపేంద్ర)కు వీరాభిమాని. లోకల్‌గా ఫ్యాన్స్‌ ప్రెసిడెంట్. తన ఫేవరేట్‌ హీరోను ఎవరేమన్నా గొడవపడతాడు. షో క్యాన్సిల్ చేశారంటే థియేటర్ అద్దాలు పగలకొడతాడు. అదే థియేటర్‌‌లో టికెట్లు కొని అభిమానులకు పంచిపెడతాడు. పక్కనోళ్లు అది పిచ్చి అంటుంటే తను మాత్రం అభిమానం అంటాడు.

అలాంటి ఓ సాధారణ అభిమాని.. థియేటర్‌‌ ఓనర్‌‌ పురుషోత్తం (మురళీ శర్మ) కూతురు మహాలక్ష్మి (భాగ్యశ్రీ బోర్సే) ఇష్టపడతాడు. ఏ క్రమంలో వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ తన థియేటర్‌‌లో టికెట్ల కోసం పడిగాపులు గాచే ఓ అభిమానికి తన కూతురును ఎలా ఇస్తానంటూ ఎద్దేవ చేస్తాడు పురుషోత్తం. తన ప్రేమను గెలుచుకోవడం కోసం కరెంట్, రోడ్డు సహా కనీస అవసరాలు లేని తన ఊర్లో AC థియేటర్ కట్టి తన అభిమాన హీరో 100వ సినిమాతో ఓపెనింగ్‌ చేస్తానని ఛాలెంజ్ చేస్తాడు సాగర్. అలా తాను విసిరిన ఛాలెంజింగ్ కోసం సాగర్ ఏం చేశాడు అనేది మిగతా కథ.

మరోవైపు మారుమూల గ్రామంలో ఉన్న ఈ అభిమాని కోసం స్టార్ హీరో సూర్య ఎందుకు వెతుక్కుంటూ రావల్సి వచ్చింది. అంతలా ఆ హీరో కోసం సూర్య ఏం చేశాడు అనే ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా.