Kiara Advani: కూతురు పేరు ప్రకటించిన హీరోయిన్ కియారా అద్వానీ.. సోషల్ మీడియాలో పోస్ట్

Kiara Advani: కూతురు పేరు ప్రకటించిన హీరోయిన్ కియారా అద్వానీ.. సోషల్ మీడియాలో పోస్ట్

బాలీవుడ్ బ్యూటీ కపుల్స్లో ‘సిద్ధార్థ్‌ మల్హోత్ర-కియారా’ జోడీ వెరీ స్పెషల్. వీరిద్దరూ తమ వరుస సినిమాలతో బాలీవుడ్ సినీ సామ్రాజ్యాన్ని ఏలేస్తున్నారు. ఇటీవలే, 2025 జులై 15న ఈ జంట తమ మొదటి సంతానంగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

ఈ సందర్భంగా శుక్రవారం (2025 నవంబర్ 28న) తమ కుమార్తె పేరు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తమ ముద్దుల కూతురు ‘‘సరాయా మల్హోత్ర’’కి అందరి ఆశీర్వాదాలు కావాలని సిద్ధార్థ్‌-కియారా కోరారు. ‘సరాయా’ అనగా యువరాణి అని అర్ధం. అయితే, పాప ముఖాన్ని మరో ముఖ్యమైన తేదీలో ఈ జంట వెల్లడించే అవకాశం ఉంది.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KIARA (@kiaraaliaadvani)

2021లో విడుదలైన ‘షేర్షా’లో హీరో సిద్ధార్థ్‌, కియారా జంటగా నటించారు. అక్కడి నుంచి మొదలైన వారి పరిచయం ప్రేమగా మారింది. 2023 ఫిబ్రవరి 7న కుటుంబసభ్యుల సమక్షంలో రాజస్థాన్ జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్ వీరి వివాహ వేడుకకు వేదికగా నిలిచింది. 2025 ఫిబ్రవరి నెలలో కియారా తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చింది.

Also Read : షారుక్ ఖాన్ ఇమేజ్‌ను హ్యాండిల్ చేయలేకపోయా

ప్రస్తుతం కియారా అద్వానీ సౌత్​..నార్త్ అనే తేడా లేకుండా వరుస ఆఫర్లు పట్టేస్తోంది. భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయింది. ఈ ఏడాది మొదట్లో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాలో మెరిసింది. ఇటీవలే కియారా  'వార్‌ 2' తో ప్రేక్షకుల ముందుకు రాగా..  సిద్ధార్థ్‌ ' పరం సుందరి' తో వచ్చాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KIARA (@kiaraaliaadvani)