AndhraKingTaluka: ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ ఫోర్త్ సింగిల్ ప్రోమో అదిరింది.. ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ పూర్తి సాంగ్ ఎప్పుడంటే?

AndhraKingTaluka: ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ ఫోర్త్ సింగిల్ ప్రోమో అదిరింది.. ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ పూర్తి సాంగ్ ఎప్పుడంటే?

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. ‘మిస్ శెట్టి మిస్టర్  పోలిశెట్టి’ ఫేమ్  పి.మహేష్ బాబు మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ నెల నవంబర్ 28న మూవీ థియేటర్లకి రానుంది. ఈ క్రమంలో మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఆడియన్స్ ని అట్ట్రాక్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వరుస సాంగ్స్ రిలీజ్ చేస్తూ హైప్ పెంచుతున్నారు.

లేటెస్ట్గా (నవంబర్ 11న) ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నుంచి నాలుగో పాట ప్రోమో రిలీజ్ చేశారు. ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ (First Day First Show) అంటూ సాగే ఈ పాటను చిత్రబృందం పంచుకుంది. థియేటర్‌ ముందు రామ్‌ చేసిన డ్యాన్స్‌ ఆకట్టుకునేలా ఉంది. వివేక్, మెర్విన్ ట్యూన్ అందించిన ఈ పాటకు దినేష్ కక్కెర్ల లిరిక్స్ రాశారు. శేఖర్ వి.జె కొరియోగ్రఫీ చేశారు. 

ఈ మూవీలో కన్నడ రియల్ స్టార్ హీరో ఉపేద్రకు రామ్‌ వీరాభిమానిగా కనిపించనున్నాడు. చిన్నప్పటి నుంచి సినిమాలపై పిచ్చి ప్రేమతో ఉన్న కుర్రాడి, లైఫ్ లోకి తన అభిమాన హీరో వస్తే ఎలాంటి మలుపు తిరిగిందనేదే ఆంధ్రా కింగ్. అందుకు తగ్గట్టుగానే సాంగ్ ఇంట్రెస్టింగ్గా ఉండనుందని తెలుస్తోంది. ఈ పూర్తీ ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ పాట రేపు బుధ‌వారం విడుద‌ల కానుంది.

ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్రతో పాటుగా వీటీవీ గణేష్, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు.