
- రేపటి ప్రారంభ వేడుకలు చూసేందుకు భారీ స్క్రీన్‌లు ఏర్పాటు
బషీర్‌బాగ్, వెలుగు: సోమవారం అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభ వేడుకలను వీక్షించేందుకు బీజేపీ తరఫున నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంపీ కె. లక్ష్మణ్ తెలిపారు. అయోధ్య తరహా సెట్టింగ్, ఆలయ ప్రారంభం లైవ్ చూసేందుకు భారీ స్క్రీన్, అన్నదానం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 500 ఏళ్ల నాటి నిరీక్షణకు తెరపడనుందన్నారు.
దేశంలోని140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష నెరవేరబోతుందన్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయన్నారు. నిజాం గ్రౌండ్‌లో జరిగే ప్రత్యక్ష ప్రసారంలో గవర్నర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు.