
గోదావరిఖని, వెలుగు: కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన స్వచ్చ సర్వేక్షణ్ 2024-–25 ర్యాంకుల్లో రామగుండం కార్పొరేషన్ ఉత్తమ ర్యాంక్ సాధించింది. దేశవ్యాప్తంగా 4,589 పట్టణాలతో పోటీపడి 216 వ ర్యాంకు సాధించింది. అలాగే రాష్ట్రంలోని 143 మున్సిపాలిటీల్లో 28వ స్థానంలో నిలిచింది.
ఈ ఏడాది మల్కాపూర్ వద్ద నిర్మించిన ఫీకల్స్లడ్జ్ట్రీట్మెంట్ప్లాంట్(ఎఫ్‌సీటీపీ)ని వినియోగంలోకి తీసుకురావడంతో రామగుండం కార్పొరేషన్‌కు ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ (ఓడిఎఫ్)లో ప్లస్ హోదా దక్కింది. బల్దియా ఉత్తమ ర్యాంక్ సాధించడానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అడిషనల్కలెక్టర్, కమిషనర్ అరుణ శ్రీ అభినందించారు.