
గోదావరిఖనిలో ట్రాఫిక్ నిబంధనల్లో భాగంగా హెల్మెట్ ధరించి స్కూటీలు నడుపుతున్న మహిళలను ప్రోత్సహించేందుకు రామగుండం ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమం మొదలుపెట్టారు. హెల్మెట్ ధరించి బండి నడుపుతున్న లేడీస్‌కు చీరలను గిఫ్ట్‌గా ఇస్తున్నారు.
గురువారం టౌన్‌లోని టీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలుచేశారు. ప్రజల్లో మార్పు రావడం కోసమే హెల్మెట్ ధరించిన మహిళలకు గిఫ్ట్‌లు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో రామగుండం ట్రాఫిక్ సీఐ బి.రాజేశ్వరరావు, ఎస్‌ఐ జి.హరిశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. -గోదావరిఖని, వెలుగు