KCRలాగే హరీష్ రావు బ్రాహ్మణ పక్షపాతి : రమణాచారి

KCRలాగే హరీష్ రావు బ్రాహ్మణ పక్షపాతి : రమణాచారి

సిద్దిపేట పట్టణంలో బ్రాహ్మణ పరిషత్ సంక్షేమ సదనాన్ని సందర్శించారు ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. సమాజాన్ని చైతన్యపరిచేలా ఈ భవనం ఉండాలని రమణాచారి ఆకాంక్షించారు. భవన సుందరీకరణకు జూన్ 15 కల్లా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. వచ్చే నెలలో బ్రాహ్మణ పరిషత్ పై అవగాహన సదస్సు ఏర్పాటుచేస్తామనీ..  బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పారు. కేసీఆర్ లాగే… హరీష్ రావు కూడా బ్రాహ్మణ పక్షపాతి అన్నారు రమణాచారి.

సమాజానికి బ్రాహ్మణులు చాలా అవసరం అనీ… వారు లేకుండా పురహితం జరగదని చెప్పారు ఎమ్మెల్యే హరీష్ రావు. బ్రాహ్మణ పరిషత్ … వేదపండితులకు, ఉపనాయనాలకు, ఆధ్యాత్మికతకు నెలవై ఉండాలన్నారు. చినజీయర్ లాంటి స్వామిజీలు వస్తే ఈ భవనం వేదిక అవ్వాలన్నారు. బ్రాహ్మణ మహిళలకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి సబ్సిడీ ఇచ్చి వారి సంక్షేమానికి తోడ్పడాల్సి ఉందన్నారు హరీష్ రావు.