కేసీఆర్ సారూ..మాకు స్టైఫండ్ పెంచండి : రామంతపూర్ ప్రభుత్వ హోమియోపతి కాలేజీ హౌస్ సర్జన్ల వినతి

కేసీఆర్ సారూ..మాకు స్టైఫండ్ పెంచండి : రామంతపూర్ ప్రభుత్వ హోమియోపతి కాలేజీ హౌస్ సర్జన్ల వినతి

హైదరాబాద్ : తమ సమస్యలను పరిష్కరించాలంటూ రామంతపూర్ ప్రభుత్వ హోమియోపతి కాలేజీ హౌస్ సర్జన్ లు అలుపెరగకుండా పోరాటం చేస్తున్నారు. శనివారం (ఆగస్టు 19న) హౌస్ సర్జన్ లు 25వ రోజు కూడా ధర్నా చేపట్టారు. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ రామంతాపూర్ లో రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కు వినతిపత్రం అందించారు. 

2014 జీవో ప్రకారం తమకు స్టైఫండ్ (ఉపకార వేతనం) పెంచలేదని, దాదాపు 8 నెలల నుంచి స్టైఫండ్ ఇవ్వకపోవడంతో తాము విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నామని రామంతపూర్ ప్రభుత్వ హోమియోపతి కాలేజీ హౌస్ సర్జన్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకటే ప్రభుత్వ హోమియో మెడికల్ కాలేజ్ ఉందని, హౌస్ సర్జన్లకు ప్రతి ఏటా 15శాతం స్టైఫండ్ పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం 2014లో తమకు హామీ ఇచ్చిందని చెప్పారు. స్టైఫండ్ విషయంలో కోర్టు ఆర్డర్ ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తమకు స్టైఫండ్ పెంచే వరకూ నిరసనలు తెలుపుతూనే ఉంటామని హెచ్చరించారు.