వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి చెందిన వ్యవసాయ భూముల కౌలు వేలం పాటను ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. లక్ష్మీదేవిపేట, పాలంపేట, వెంకటాపూర్ శివారుల్లో ఉన్న భూములను మొత్తం రూ.2.82 లక్షలకు రైతులు వేలంలో దక్కించుకున్నారు. గత సంవత్సరం కంటే ఈసారి రూ.44,500 అధికంగా ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు.
గోవిందరావుపేట, రామాంజపూర్, బుద్ధారం శివార్లలో ఉన్న భూములకు ఆయా గ్రామాల రైతులు వేలం పాటకు హాజరుకాకపోవడంతో ఆ భూముల వేలాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు.
