నక్సలిజం అంతం కోసమే ఆపరేషన్ కగార్ : రాంచందర్రావు

నక్సలిజం అంతం కోసమే ఆపరేషన్ కగార్ : రాంచందర్రావు
  • ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే బీసీ రిజర్వేషన్లు: రాంచందర్​రావు

హైదరాబాద్, వెలుగు: దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ‘కగార్’ చేపట్టిందని బీజేపీ స్టేట్​చీఫ్ రాంచందర్ రావు చెప్పారు. తుపాకులు వదిలి మార్చి31 లోగా లొంగిపోవాలని మావోయిస్టులను కేంద్రం హెచ్చరించిందని.. ఇది వారికి జనజీవన స్రవంతిలో కలిసేందుకు మంచి అవకాశమని తెలిపారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. 

లెఫ్ట్ వింగ్ ఎక్స్‌‌ట్రిమిజం ఈ దేశం నుంచి వెళ్లిపోవాలని, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కామారెడ్డి డిక్లరేషన్‌‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ఆరోపించారు. లోకల్​బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు.